ప్రజాశక్తి- లీగల్ రిపోర్టర్ : జాతీయ న్యాయ సేవలు దినోత్సవం సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు వారాలపాటు నిర్వహించిన ప్రత్యేక న్యాయ చైతన్య కార్యక్రమాలు ఆదివారంతో ముగిసాయి. జిల్లా న్యాయ సేవా సదన్‌లో డిఎల్‌ఎస్‌ఎ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.తిరుమలరావు మాట్లాడుతూ, రెండు వారాల పాటు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందసంస్థల ఆధ్వర్యంలో పలు విద్యాలయాల్లోనూ న్యాయ చైతన్య సదస్సులు, ర్యాలీలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా 'మత్తు పదార్థాలు విడనానండి సే నోటు డ్రగ్' నినాదంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించిందన్నారు. ఇందులో భాగంగానే జల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కెవివి బులికృష్ణ విశాఖ సెంట్రల్ జైలును సందర్శించి, ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు వారికి ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారన్నారు. అలాగే అరకులో రెండు వేల మందితో 'సే నో టు డ్రగ్' అంశంపై రెండు వేల మందితో ర్యాలీ చేపట్టామన్నారు. ముగింపు సందర్భంగా విశాఖలోనూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు బైపారుణ్ కుమార్, వివిధ న్యాయ కళాశాలల విద్యార్థులు, పారాలీగల్ వాలంటీర్లు, ప్యానల్ లాయర్లు, ధాత్రి స్వచ్ఛందసంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.










