Jun 01,2023 00:19

కలనేత నాటకంలోని ఓ సన్నివేశం

ప్రజాశక్తి- భట్టిప్రోలు : మండల పరిధిలోని పల్లెకోన గ్రామంలో ఎన్‌టిఆర్‌ కళాప్రాంగణం లో గత నాలుగు రోజులుగా నిర్వమిస్తున్న పరుచూరి రఘుబాబు స్మారక 31వ అఖిల భారత నాటక పోటీలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజున విశ్వశాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ వారు 'కలనేత' నాటకాన్ని ప్రదర్శించారు. పంటలు పండించటానికి ప్రకతి సహకరించక పోయినా, పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా ఎరువులు, పురుగు మందులు ధరలు పెరిగినా అన్ని బాధలు భరించి దేశానికి అన్నం పెట్టేవాడే రైతన్న. మిల్లు వస్త్రాలు పెరిగిపోయి వాటితో పోటీ పడలేక నేచిన చీరకు గిట్టుబాటు ధర లేక చీరలు నేచి మానాలను కాపాడుతున్నాడు నేతన్న. దురదష్టం ఏమిటంటే ఈ రెండు వత్తులు చేస్తున్న వారే నేడు దేశంలో ఆత్మహత్యలకు గురవు తున్నారు. వారి జీవితాలు బాగుపడలన్నా, ఆత్మహత్యలు అపాలన్న ఎవరెవరు వాళ్ళను ఎలా ఆదుకోవాలో-వాళ్లలో ఎలా ఆత్మస్తేర్యం నింపాలో సూచించేదే ఈ కలనేత నాటకం. రైతే దేశానికి వెన్నుముక-రైతే రాజు అని ప్లెక్సీలలో వేయటం కాదు.ఎవరెవరు ఎలా అదుకోవలో మార్గం చూపించేదే ఆకెళ్ల రచించిన ఈ నాటకం. బిఎం. రెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించబడిన ఈ కలనేత ప్రేక్షకులను అలరింపు జేసింది. నాటక ప్రదర్శన అనంతరం ప్రోత్సహక బహుమతులను రచన,నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు.