ప్రజాశక్తి - రేపల్లె
ఏబిఆర్ డిగ్రీ కళాశాలనలో నాక్ కమిటి పర్యటన ముగిసిందని కళాశాల ప్రిన్సిపాల్ రవిచంద్ర కుమార్ తెలిపారు. కళాశాల ఐక్యూ, ఏసి, ఎన్‌సిసి, మహిళా సాధికారత విభాగం, కేరీర్ గైడాన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్, క్రీడా ప్రాంగణం, విధార్ధులకు అందుతున్న ఉపకార వేతనాలను నాక్ కమిటీ సభ్యులు పరిశీలించారు. కళాశాల అభివృది గురించి సలహాలు, సూచనలు రిపోర్టులో పొందుపరిచారు. వీడ్కోలు సభలో కమిటీ సభ్యులకు కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విధ్యార్ధినీ, విధ్యార్ధులు కృతజ్ఞతలు తెలిపారు. ఏబిఆర్ ప్రభుత్వకళాశాల మంచి నాక్ గ్రేడ్ సాధిస్తుందని ప్రిన్సిపల్ టిసి రవిచంద్ర కుమార్ ఆశా భావం వ్యక్తం చేశారు.










