Nov 27,2022 00:20

బహుమతులతో విజేత విద్యార్థులు

ప్రజాశక్తి- కశింకోట : కశింకోట డిపిఎన్‌ బాలురు హైస్కూల్‌లో భారతీయ విజ్ఞాన మండలి, ఎపి కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్‌, పోస్టర్‌ మేకింగ్‌ పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో జిల్లాలోని 36 హైస్కూల్‌ నుండి 108 మంది 8, 9, 10 తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్‌ పోటీల్లో ప్రథమ బహుమతి పెదముషిడివాడ పాఠశాల, ద్వితీయ బహుమతి వేములుపూడి ఎపిఎంఎస్‌, తృతీయ బహుమతి కశింకోట కెజిబివి, పోస్టర్‌ మేకింగ్‌ పోటీల్లో ప్రథమ బహుమతి చెట్టుపల్లి పాఠశాల, ద్వితీయ బహుమతి దేవరాపల్లి పాఠశాల విద్యార్థులు గెలుచుకున్నారు. విజేతలకు శనివారం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ చిట్టిబాబు, హైస్కూల్‌ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధరరెడ్డి, కౌశల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ పార్ధసారధి, జిపిఎస్‌ నాయుడు, విశ్రాంత ఉద్యోగి జివి అప్పారావు పాల్గొన్నారు.