Apr 14,2023 22:52

ప్రజాశక్తి-చందర్లపాడు: మండలంలోని పాత బెల్లంకొండవారిపాలెం గ్రామంలో అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ శుక్రవారం ముగిసింది. ఈ టోర్నమెంట్లో 50 టీంలు పాల్గొన్నాయి. విజయం సాధించిన అడివిరావులపాడు క్రికెట్‌ టీంకు చందర్లపాడు మాజీ జడ్పిటిసి సభ్యులు వాసిరెడ్డి ప్రసాద్‌ చేతుల మీదుగా రూ.25 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి లక్ష్మీనారాయణ, కె.సుబ్బారావు, గద్దె హనుమంతరావు పాల్గొన్నారు.