ప్రజాశక్తి -కోటవురట్ల:మండల కేంద్రంలో ఈనెల 12 నుండి ప్రారంభమైన క్రికెట్ లీగ్ పోటీలు మంగళవారంతో ముగిసాయి. గారా ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో చివరి రోజు ఫైనల్లో చెరుకూరి, రావాడ టీములు పోటీ పడగా రావాడ టీం విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోటీలలో గెలుపొందిన విజేతలకు మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి రూ.20,000, ద్వితీయ బహుమతి రూ.10,000 తృతీయ బహుమతి రూ.5000 చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, క్రీడల పట్ల ప్రతి ఒక్కరు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్రీడలతో మానసిక వికాసంతో పాటు శారీరక దారుడ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనిల్ కుమార్, వివిధ జట్ల మేనేజర్లు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










