ప్రజాశక్తి-పాడేరు:భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్ధాయి సైన్స్ క్విజ్ పోటీలు పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా ముగిసాయి. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వివిధ పాఠశాలల విద్యార్థులకు నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్లను అందజేసినట్లు జిల్లా కోఆర్డినేటర్ రమణమూర్తి నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జిల్లా స్ధాయి క్విజ్ పోటీలలో ప్రధమ స్థానంలో నిలిచిన తురకలవలస ఆశ్రమ పాఠశాల విద్యార్థినీలకు రూ.7500 ప్రైజ్‌మనీ, జ్ఞాపిక, సర్టిఫికేట్ అందజేశామని తెలిపారు. రెండవ బహుమతి కందమామిడి బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినీలకు రూ.6 వేల ప్రైజ్ మనీ, మూడవ బహుమతి లోచలిపుట్టు బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు రూ.4,500 ప్రైజ్ మనీ అందజేసినట్లు ఆయన తెలిపారు. విజేతలు అందరికీ ప్రైజ్ మనీతో పాటు జ్ఞాపికలు సర్టిఫికెట్లను అందజేశామని చెప్పారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు డిసెంబర్ 8, 9 తేదీలలో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు.










