Dec 04,2022 22:15

కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ పి.రమేష్‌ పర్యవేక్షణలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ఆదివారం పురుషులకు క్రికెట్‌, పురుషుల, మహిళలకు కబడ్డీ, వాలీబాల్‌ పోటీలను నిర్వహించారు. పురుషుల క్రికెట్‌ పోటీల్లో అరుకు నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు ప్రథమ స్థానాన్ని, రంపచోడవరం నియోజకవర్గ క్రీడాకారులు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పురుషుల కబడ్డీ పోటీల్లో రంపచోడవరం నియోజకవర్గ క్రీడాకారులు ప్రథమ స్థానాన్ని, అరుకు క్రీడాకారులు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పురుషులు వాలీబాల్‌ పోటీల్లో అరుకు ప్రథమ స్థానాన్ని, రంపచోడవరం ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల కబడ్డీ పోటీల్లో అరుకు ప్రథమ స్థానాన్ని, రంపచోడవరం ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల వాలీబాల్‌ పోటీల్లో పాడేరు క్రీడాకారులు ప్రథమ స్థానాన్ని, అరకు నియోజకవర్గ క్రీడాకారులు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజేతలకు డిఇఒ మెమోంటోలు అందజేశారు.