ప్రజాశక్తి -తిరువూరు : విద్యార్థులకు సెలవుల్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించడానికి జన విజ్ఞానవిజ్ఞానవేదిక(జెవివి) ఉచిత వేస వి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుందని జె వివి జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్.వి.ర వీంద్ర అన్నారు. తిరువూరు సుందర య్య విజ్ఞాన కేంద్రంలో గత 18 రోజులు గా జెవివి ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం బుధవారం ముగి సింది. ఈసందర్భంగా రవీంద్ర మాట్లా డుతూ విద్యార్థులు చదువుతో పాటు సాధారణ జీవన నైపుణ్యాలను కూడా పెంచుకోవాలని సూచించారు. వేసవి లో సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ వివి ధ ఆటలు ఆడుకుంటూ వేసవి శిబిరా లను సద్వినియోగం చేసుకోవాలన్నా రు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో జెవివి రాష్ట్ర చెకుముకి కన్వీనర్ ఎం.హరిక ష్ణ, జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్, ప్రతినిధులు ఎం.రాం ప్రదీప్, కె.పాపారావు, డి.సుదర్శన్, ఎం.నాగేం ద్ర ప్రసాద్, కె.హరీష్, సిహెచ్.అప్పారా వు, ప్రజాసంఘాల నాయకులు ఎం. ప్రభాకరరావు, బి.వెంకటేశ్వరరావు, ఆకుల రవి తదితరులు పాల్గొన్నారు.










