Jul 08,2023 23:48

విజేత జట్టుకు మెగా టోర్నీ కప్‌ను అందజేస్తున్న ఎంపిటిసి, సర్పంచ్‌ తదితరులు

విన్నర్‌గా ములకపల్లి, రన్నర్‌గా టేకుపల్లి జట్లు
ప్రజాశక్తి-విఆర్‌.పురం

మండలంలోని జీడిగప్ప పంచాయితీ పరిధి రాయిగూడెం క్రీడా మైదాంలో పది రోజుల పాటు నిర్వహించిన జెఆర్‌ మోగా క్రికెట్‌ టోర్నమెంట్‌ శనివారం ముగిసింది. శనివారం జరిగిన పైనల్‌ పోరులో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం టేకుపల్లి, విఆర్‌.పురం మండలం ములకపల్లి జట్లు తలపడగా.., ములకపల్లి జట్టు విజేతగా నిలించింది. విన్నర్‌, రన్నర్‌ జట్లకు జీడిగప్ప ఎంపిటిసి వాళ్ళ వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్‌ మూట్ల బాలరాజు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విజేత ములకపల్లి జట్టు కెప్టెన్‌ గోవర్థన్‌కు మెగా టోర్నీ కప్‌ను, రూ.15వేలు నగదు బహుమతి, రన్నర్‌ టేకుపల్లి జట్టు కెప్టెన్‌ వేట్ల అబ్బాయి రెడ్డికి సీల్డ్‌, రూ.10వేలు నగదు బహుమతిని అందజేశారు. అనంతరం ఎంపిటిసి వాళ్ళ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ నేడు యువత అనేక చెడు వ్యసనాలకు బానిసై వక్ర మార్గాలు వైపి వెళ్లి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడిగుప్ప పంచాయితీలో ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా యువతలో దాగి ఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికి తీయాలని పిలుపినిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహేష్‌, ఎన్‌.కన్నారావు, ఎస్‌.రాజేష్‌, పి.మురళీకృష్ణ, ఎన్‌.వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.