ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో నమూనా పోలింగ్ ప్రక్రియను సజావుగా పకడ్బందీగా నిర్వహించామని కలెక్టర్ ఎస్. షన్మోహన్ తెలిపారు. జిల్లా సచివాలయంలోని ఎలక్షన్ గోడౌన్ నందు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ నెల 9,10 తేదీలలో నమూనా పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు. అక్టోబర్ 16 నుండి జరుగుతున్న ఈవీఎంలు, వీవీ ప్యాట్ ల మొదటి విడత తనిఖీ ప్రక్రియను శుక్రవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు.కలెక్టర్ మాట్లాడుతూ రానున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు పురస్కరించుకుని జిల్లాకు 4,840 ఈవిఎంలు, కంట్రోల్ యూనిట్లు 4580, వివిప్యాట్‌లు 5325లు అందాయన్నారు. ఈ ప్రక్రియలో డిఆర్‌ఓ ఎన్. రాజశేఖర్, డిప్యూటీ కలెక్టర్ (ఎఫ్ ఎస్ ఓ) చంద్రశేఖర్ నాయుడు, భెల్ కంపెనీ ఇంజనీర్లు టీమ్ లీడర్ మాధవ రాజు పాల్గొన్నారు.










