Mar 29,2023 16:09

కేరింతలు కొడుతున్న ఇంటర్‌ విద్యార్థులు

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు
ప్రజాశక్తి -  చాగలమర్రి

       ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిసాయి.చాగలమర్రి పట్టణంలోని వాసవి జూనియర్‌ కళాశాలలో చివరి పరీక్ష నాడు 374 మంది విద్యార్థులకు గాను 343 మంది హాజరు కాగా 31మంది గైర్హాజరు అయ్యారని పరీక్షల చీఫ్‌ రమణాకుమారి,డిపార్ట్‌మెంటల్‌ అధికారి మురళి,ప్రిన్సిపాల్‌ శివరామి రెడ్డి లు తెలిపారు.పరీక్ష కేంద్రాన్ని స్క్వాడ్‌ అధికారి రఘునాథరెడ్డి తనిఖీ చేసారు.పరీక్షలు ముగియడంతో విద్యార్థులు పరీక్షలు వ్రాసి బయటకు వచ్చి కేరింతలేసారు.