Jun 11,2023 18:09

బహుమతులు పంపిణీ చేస్తున్న జడ్పిటిసి పుల్యాల దివ్య, సర్పంచ్ శేషన్న

 

ముగిసిన గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరం
ప్రజాశక్తి - పగిడ్యాల

      గ్రంథాలయ వేసవి విజ్ఞాన  శిబిరం ఆదివారం ముగిశాయని గ్రంథాలయాధికారిణి కే.మద్దమ్మ తెలిపారు. మే 8 నుంచి ప్రారంభమైన గ్రంథాలయ వేసవి విజ్ఞాన  శిబిరం ఆదివారం ముగిశాయని అన్నారు. వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులు ఆటలు పాటలతో కథల పుస్తకాలు చదివించడం విజ్ఞానానికి పెంపొందించేందుకు అవసరమైన పుస్తకాలను చదివించడం జరిగిందన్నారు.   ముగింపు కార్యక్రమానికి జడ్పిటిసి పుల్యాల దివ్య, సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పిటిసి పుల్యాల దివ్య, సర్పంచ్ శేషన్న మాట్లాడారు. పాఠశాలలకు వేసవి సెలవుల్లో గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. పిల్లలు వేసవికాలంలో ఇంట్లో వద్ద ఉండకుండా గ్రంథాలయమికొచ్చి పుస్తకాలును చదివి వినియోగించుకోవడం మంచి పరిణామం అన్నారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం గ్రంధాలయానికి వచ్చి పుస్తకాలు, వార్తాపత్రికలు చదవాలన్నారు. పుస్తకాలు చదివినప్పుడే విజ్ఞానం పెంపొంది అవకాశముందన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.