Nov 20,2023 19:49

ఆస్పరిలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆస్పరి
ఆస్పరిలో గ్రంథాలయ అధికారి విశ్వనాథ్‌ రెడ్డి అధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన 56వ గ్రంథాలయ వారోత్సవాలు సోమవారం ముగిశాయి. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా కెడిసిసి డైరెక్టర్‌ రాఘవేంద్ర, సొసైటీ ఛైర్మన్‌ గోవర్ధన్‌, వైసిపి మండల కన్వీనర్‌ పెద్దయ్య, మండల మాజీ కన్వీనర్‌ రామాంజనేయులు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ చూపాలని సూచించారు. సెల్‌ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తకాలపై మక్కువ పెంచుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా విలేజ్‌ గ్రంథాలయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గ్రంథాలయ అధికారి విశ్వనాథ్‌రెడ్డి మాట్లాడుతూ... అందరి సహకారంతో వారోత్సవాలు విజయవంతంగా ముగిశాయని, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ సిఇఒ అశోక్‌, మండల వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ రాజగోపాల్‌ రెడ్డి, వైసిపి నాయకులు తిమ్మప్ప, శివారెడ్డి, వార్డు సభ్యులు అలీ బాష, విజేత, నారాయణ, నోబుల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు బాలరాజు, రామకృష్ణ, జంషుర్‌ వలీ, సతీష్‌, నారాయణ, పాఠకులు నరసప్ప, రామకృష్ణ, రవి, ప్రకాష్‌, రాకేష్‌ రెడ్డి పాల్గొన్నారు. నందవరంలో గ్రంథాలయాధికారి వై.శివరామప్రసాద్‌ ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. నందవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు జి.రామకృష్ణ, పంచాయతీ సెక్రటరీ ఎం.ప్రసాద్‌, టి.రంగముని పాల్గొని గ్రంథాలయాల గురించి వివరించారు. వ్యాచరచన, చిత్రలేఖనం, వక్తృత్వ, పరుగు పందెం పోటీల్లో విజేతలుగా నిలిచిన 60 మంది విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కౌతాళంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగిశాయి. గ్రంథాలయ అధికారి మధులినా మాట్లాడుతూ... స్థానిక కన్నడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించామని తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బహుమతులు అందజేశామన్నారు. ఆలూరు, మొలగవల్లి గ్రంథాలయ అధికారుల ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఆలూరు గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉమా ఫంక్షన్‌ హాలులో బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత, న్యాయవాది ప్రసాద్‌ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు. మొలగవల్లి గ్రంథాలయ అధికారి విజయ భాస్కర్‌ ఆధ్వర్యంలో కార్యాలయంలో జడ్‌పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు బహుమతులు ప్రదానం చేశారు. ప్రముఖ కవి అన్నే శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్‌, శ్రీనివాస నాయుడు, ప్రకాష్‌, అశ్విని, ఈరన్న, అనసూయమ్మ, రామాంజినేయులు, గ్రామస్తులు రాజేంద్ర ప్రసాద్‌, దానప్ప, పుస్తక నిక్షిప్త కేంద్ర నిర్వాహకులు రంగస్వామి, రాజమ్మ పాల్గొన్నారు.

నందవరంలో బహుమతులు అందజేస్తున్న సిబ్బంది
నందవరంలో బహుమతులు అందజేస్తున్న సిబ్బంది