Nov 20,2023 22:05

టెక్కలి : మెమోంటోను అందజేస్తున్న సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌

ప్రజాశక్తి- టెక్కలి/టెక్కలి రూరల్‌ : యువతకు దేశ భవిష్యత్‌ మార్చగల సామర్థ్యాత ఉందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ గోవిందమ్మ అధ్వర్యాన 56 గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు భాగంగా సోమవారం కీర్తిశేషులు కొర్ల రేవతి మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా గ్రూప్స్‌, పబ్లిక్‌ సర్వీసెస్‌ పోటీకి సిద్ధమవుతున్న విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. అలాగే వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కుమర్‌, టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త దువ్వాడ వాణి, మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, కొర్ల రేవతి మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ ఎస్‌.శిరీష, శ్రీనివాసరావు, దువ్వాడ హైందవి, ఎంపిపి ఆట్ల సరోజనమ్మ, గండి అప్పలరెడ్డి, హనుమంతు ఉదయభాస్కరరావు పాల్గొన్నారు.
శ్రీకాకుళం: విద్యార్థి దశ నుంచే గ్రంథాలయాలపై అవగాహన కలిగి ఉండాలని గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సువ్వారి సువర్ణ అన్నారు. నగరంలోని జిల్లా గ్రంథాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్‌ వి.వి.జి.ఎస్‌.శంకరరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ముగింపు గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్నారు. వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు గ్రంథాలయ కార్యదర్శి బి.కుమార్‌రాజుతో కలసి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ ప్రతినిధి సత్యనారాయణ, సోడవరం ఈశ్వరరావు, ఫిల్మోజీ సంగీతం డైరెక్టర్‌ నవీన్‌, కె.లక్ష్మణ్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ ఎస్‌.వి. రమణమూర్తి పాల్గొన్నారు.
నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషుల గ్రంథాలయంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సురేఖ, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎం.వి.సత్యనారాయణ, ఐక్యూఎసి కో-ఆర్డినేటర్‌ హరిత, గ్రంథాలయ కమిటీ సభ్యులు డాక్టర్లు సూరిబాబు, రామారావు, పి.వి.రమణ, తెలుగు అధ్యాపకులు పి.నారాయణరావు పాల్గొన్నారు.
నందిగాం: స్థానిక గ్రంథాలయాధికారి ఉదరుకిరణ్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, ఎంపిపి నడుపూరు శ్రీరామ్మూర్తి, సర్పంచ్‌ జడ్యాడ జయరాం, ఎంపిటిసి అంబోడి విష్ణు, ప్రధానోపాధ్యాయులు హరిబాబు, రాము పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.
మెళియాపుట్టి : స్థానిక గ్రంథాలయంలో వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎంపిడిఒ పి.చంద్రకుమారి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి ఆర్‌.అనురాధ, ఇఒపిఆర్‌డి తారకేశ్వరి, ఎంఇఒలు దేవేంద్రరావు, పద్మనాభం, ప్రతాప్‌, గణపతిరావు, తనూజ, శ్వేత, భాస్కరరావు, పండు, రాణి పాల్గొన్నారు.
ఎచ్చెర్ల : ధర్మవరం గ్రంథాలయంలో టేకీ ఆచారి అధ్యక్షతన నిర్వహించిన ముగింపు వారోత్సవంలో కొయ్యాం జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ తవిటినాయుడు, సర్పంచ్‌ అల్లు కన్నబాబు, ఎంపిటిసి బగ్గు రాజారావు, అసిరితల్లి యువజన సంఘం అధ్యక్షులు రుప్ప లక్షుంనాయుడు, పాఠశాల హెచ్‌ఎం హరికృష్ణ మిధుల విద్యాలయం కరస్పాండెంట్‌ జయరాం, గ్రంథాలయ అధికారి మల్లిపెద్ది చంద్రశేఖర్‌, సహాయకులు సూర్యనారాయణ, యువజన సంఘ సభ్యులు మహేష్‌ పాల్గొన్నారు. ప్రసాద్‌ మ్యాజిక్‌ షో నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
ధర్మవరం శాఖా గ్రంథాలయాధికారిగా పనిచేస్తున్న మల్లిపెద్ది చంద్రశేఖరరావుకు వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉత్తమ గ్రంథ పాలకుడుగా ఘనంగా సన్మానం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు సువారీ సువర్ణ, బి.కుమార్‌ రాజు, చైర్‌పర్సన్‌ ప్రతినిధి ఎస్‌.సత్యనారాయణ, డిప్యూటీ లైబ్రేరియన్‌ శంకరరావు శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
పోలాకి : స్థానిక శాఖాగ్రంథాలయంలో మౌలిక వసతులు కల్పనకు నిధులు మంజూరు చేస్తానని జెడ్‌పిటిసి ధర్మాన కృష్ణచైతన్య హామీనిచ్చారు. గ్రంథాలయ వారోత్సవంలో పాల్గొని విజేతలకు బహముతులను అందజేశారు. గ్రంథాలయానికి ఆణించి ఉన్న ఖాళీ స్థలం ఆక్రమనకు గురవుతుందని, ప్రహరీ నిర్మించాలని గ్రంథాలయాధికారిని కె.మానస జెడ్‌పిటిసి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి ముద్దాడ భైరాగినాయుడు, సర్పంచ్‌ మజ్జి రమణమ్మ, ప్రతినిధి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం : గ్రంథాలయంలో వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి పూర్ణచంద్ర బెహరా, ప్రభుత్వ ఉన్నత ప్రధానోపాధాయులు విశ్వనాథ్‌, ఆర్‌సిగౌరీశంకర్‌రెడ్డి, ఈశ్వరి, పీడీ గణేష్‌ పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు : గ్రంథాలయంలో వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు వజ్రపుకొత్తూరు సర్పంచ్‌ ప్రతినిధి పి.గురయ్య నాయుడు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార బి.అప్పలస్వామి, ఎంపిపి స్కూల్‌ ఉపాధ్యాయులు, డోకులపాడు సర్పంచ్‌ ప్రతినిధి వడ్డి కరుణాకర్‌ పాల్గొన్నారు.
టెక్కలి రూరల్‌: గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త దువ్వాడ వాణి అన్నారు. స్థానిక శంభానవీధిలో శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి బి.రూప ఆధ్వర్యాన నిర్వహించిన ముగింపు గ్రంథాలయ వారోత్సవంలో పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ చింతాడ లక్ష్మీబాయి, ఎంపిపి ఆట్లా సరోజనమ్మ, ఎంపిటిసి కూన పార్వతి, నూనెల సోమేశ్వరరావు, గండి అప్పలరెడ్డి, దవళ కుసుడు పాల్గొన్నారు.
నౌపడ : నౌపడ శాఖాగ్రంథాలయంలో ముగింపు వారోత్సవంలో సర్పంచ్‌ బృందాదేవి, ప్రతినిధి రవికుమార్‌రెడ్డి, ఉపాధ్యాయులు ప్రేమకుమారి, గ్రంథాలయాధికారి బి.రూపావతి పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు.
కొత్తూరు : గ్రంథాలయాధికారి టి.ఇందిర ఆధ్వర్యాన నిర్వహించిన ముగింపు వారోత్సవంలో విజేతలకు సర్పంచ్‌, ఎంపిటిసిలు పడల కృష్ణావేణి, గండివలస రత్నకుమారిలు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.నారాయణరావు, ఎం.రాంబాబు, ఎ.శ్రీరాములు, పి.శివకుమార్‌, రామకృష్ణ, డి.లక్ష్మి పాల్గొన్నారు.
సంతబొమ్మాళి : స్థానిక గ్రంథాలయంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో జెడ్‌పిటిసి పాల వసంతరెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మేధావుల సంఘం అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, ఎంపిడిఒ ప్రేమలీల, గ్రంథాలయాధికారి రామకృష్ణ, ఎంఇఒలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
పలాస : స్థానిక గ్రంథాలయంలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల విజేతలకు ఎంఇఒలు శ్రీనివాసరావు, సత్యంలు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి వై.రాంబాబు పాల్గొన్నారు.
మందస : మందస గ్రంథాలయంలో వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుతులను సర్పంచ్‌ ప్రతినిధి లక్ష్మణరావు, షిరిడి సాయి సేవా సంఘం అధ్యక్షులు గిన్ని తిరుపతిరెడ్డి, గ్రంథాలయ అధికారి విజయలక్ష్మి, మోహన్‌, కోటేశ్వరరావు బహుమతులను అందజేశారు.
లావేరు: స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమానికి ఎంఇఒ లండ ఈశ్వరరావు పాల్గొన్నారు. విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఎం. పద్మావతి సుమారు రూ.5వేలు విలువ గల పోటీపరీక్ష పుస్తకాలను గ్రంథాలయానికి ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు, బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ ఎ.లక్ష్మి, యోగా టీచర్స్‌ భగవాన్‌, లక్ష్మణరావు, గ్రంథాలయ సహాయకులు జి. గడ్డియ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
జి. సిగడాం: స్థానిక శాఖా గ్రంథాలయంలో వారోత్సవాలు గ్రంథాలయ అధికారి సిహెచ్‌ వెంకటేష్‌ ఆధ్వర్యంలో ఘనంగా ముగింపు కార్యక్రమం నిర్వహంచారు. కార్యక్రమంలో ఎంపిపిి ప్రతినిధి మీసాల వెంకటరమణ, కెజిబివి స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఉషా రత్నకుమారి, జెడ్‌పిటిసి కాయల రమణ, విఅర్‌ఒ నర్సింగరావు, ఎంపిటిసి కీర్తి సత్యం, సర్పంచ్‌ ప్రతినిధి గౌరీశ్వర్‌, మోడల్‌ స్కూల్‌ లైబ్రేరియన్‌ లక్ష్మణరావు, గ్రంథాలయ సిబ్బంది ఎన్‌.దుర్గారావు, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పొందూరు: స్ధానిక శాఖా గ్రంథాలయంలో వారోత్సవాలు ముగిసినట్లు గ్రంథాలయాధికారి సిహెచ్‌ వెంకటేష్‌ తెలిపారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ రేగడి లక్ష్మి, రెడ్‌క్రాస్‌ సభ్యులు కాళ్లకూరి శాంతారాం, సాహితీవేత్త జి.ప్రభాకరరావు, సవరభాష ఆధునీకరణ రచయిత డా.ఎ.చంద్రశేఖర్‌, విశ్రాంత ఉపాధ్యాయులు గోవిందరావు పాల్గొన్నారు.