ముగిసిన 'గడప గడపకు మన ప్రభుత్వం'
ప్రజాశక్తి- కార్వేటినగరం: డిప్యూటీ సీఎం కళ్ళత్తూరు నారాయణస్వామి స్వగ్రామమైన పాదిరికుప్పంలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా పాదిరికుప్పం అక్కడక్కడ డ్రైనేజీ కాలువలపై మూతలు ఏర్పాటు చేపట్టాలని, అలాగే ఇళ్ల పైన విద్యుత్ లైన్‌లో తొలగించాలని విద్యుత్ ఏఈ రియాజును డిప్యూటీ సిఎం ఆదేశించారు. ఊతుకోట శ్రీనివాసులు క్రెన్ సహకారంతో మంత్రి నారాయణస్వామి, ఆయన కుమార్తె కపాలక్ష్మి, ఎంపీపీ లతా బాలాజీ మండల కన్వీనర్ శేఖర్ రాజులకు గజమాలతో స్వాగతం పలికారు. అదేవిధంగా చరణ్, దాము, చిరంజీవులు ఆధ్వర్యంలో గజమాలలు వేసి పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం విద్య, వైద్య రంగాలను అభివద్ధి చేశారని పేర్కొన్నారు. విద్యార్థులందూ చదువుకోవాలని నాడు- నేడు పాఠశాలల అభివద్ధి చేశారని, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అన్ని గ్రామాలలో సిమెంట్ రోడ్లు, ఆలాత్తురులో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీలో చేర్పించిన ఘనత సీఎంకి దక్కుతుందన్నారు. అదేవిధంగా కార్వేటినగరంలో స్కంద పుష్కరణిలో నీరాలు మండపం ఏర్పాటు చేయడం జరిగిందని, కార్వేటినగరం, పెనుమూరులో 50 పడకల ఆసుపత్రి మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మాజీ కన్వీనర్ కన్వీనర్ ధనంజయ వర్మ, మండల కో ఆప్షన్ మెంబర్ పట్నం ప్రభాకర్ రెడ్డి, మండల జెసిఎస్ కన్వీనర్ పురంధర్, సింగల్ విండో అధ్యక్షులు లోకనాథ్‌రెడ్డి, మాజీ తుడ ప్లానింగ్ అధికారి కష్ణారెడ్డి, వైసీపీ నాయకులు దాము, చిరంజీవి, వెంకటస్వామి, సుబ్రహ్మణ్యం, రాజారత్న, జయచంద్ర పాల్గొన్నారు.










