ప్రజాశక్తి - ఏలూరు
మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బాల వికాస్ భారతి ఆధ్వర్యంలో చారు చమక్ కార్యక్రమం పవర్‌పేటలో ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం వద్ద ప్రతి రోజు నిర్వహిస్తున్నారు. వృద్ధులకు టీ, రొట్టె, పండ్లు, ఉడకబెట్టిన గుడ్డు పలు పౌష్టికాహారాలు అందిస్తున్నారు. ముగింపు కార్యక్రమం 30వ రోజు ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వికార్ జనరల్ ఏలూరు డియోసిస్, సెయింట్ జాన్ ప్రిన్సిపల్ ఫాదర్ బాల, ముఖ్య వక్తలుగా మానవతా సంస్థ విద్యానిధి ఛైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం వృద్ధులకు చారు చమక్ కార్యక్రమంలో భాగంగా ఉడకబెట్టిన గుడ్డు, పండ్లు అందించారు. ప్రభుత్వాలు ఇతని కోసం ప్రత్యేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి జీవన ప్రమాణం పెరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సభకు అధ్యక్షత వహించిన బాల వికాస్ భారతి అధ్యక్షులు, న్యాయవాది కట్టా సత్యనారాయణ తెలిపారు. ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి జివిఎల్.నరసింహరావు వాల్ ఆఫ్ కైండ్ ఫౌండర్ ఆర్‌వి.రమణ, మానవత సంస్థ నాయకులు పి.రత్నాకర్, మానేపల్లి రామారావు, లయన్స్ క్లబ్ సభ్యులు, వృద్ధులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 30 రోజులు చారుచమక్ కార్యక్రమంలో వృద్ధులకు సంక్రాంతి సందర్భంగా నూతన వస్త్రాలు, పండ్లు, ముఖ్యఅతిథిగా, ముఖ్య వక్తలుగా పాల్గొన్న ఫాదర్ బాలా, ఆలపాటి నాగేశ్వరరావు అందించారు.










