Nov 02,2022 23:18

ముగింపు సమావేశంలో మాట్లాడుతున్న అప్పారావు

ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌లో మూడు రోజుల పాటు జరిగిన బహుజన సాంస్కృతిక వారోత్సవాలు బుధవారంతో ముగిసాయి. రిజర్వేషన్ల కల్పనపై అన్ని వర్గాల్లో అవగాహనకు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సత్యశోధన పేరుతో మహాత్మ జ్యోతీరావు ఫూలే దృశ్య నాటకాన్ని ఒబిసి అసోసియేషన్‌ లైజన్‌ ఆఫీసర్‌ గంటా అప్పారావు ప్రారంభించి మాట్లాడారు. దళిత, బహుజన వర్గాలన్ని కలికట్టుగా వుండి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ముందు రావాలని కోరారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, ఆటుపోట్లను ఎదుర్కొంటేనే, ఇప్పుడు బడుగు బలహీనవర్గాల ప్రజలు ఉన్నత ఉద్యోగాలలో కొనసాగుతున్నారన్నారు. అలాంటి వారి త్యాగాలను, జీవితాలను తెలుసుకొని వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్‌ రాధిక, డిజిఎం(హెచ్‌ఆర్‌) మనోజ్‌ ఒరాన్‌, స్టీల్‌ ఎక్జిక్యూటివ్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ కేవిడి.ప్రసాద్‌, ఉండవల్లి శ్రీనివాస్‌ , సీఐటీయూ నాయకులు వైటీ. దాసు, బొండా తౌడన్న బయ్యే మల్లయ్య, మోహన్‌బాబు, ఎల్‌వి రమణరావు, గణేష్‌, కెవి రత్నం, లక్షణమూర్తి , పైడి కొండలరావు, ఫణీంద్రబాబు, అప్పారావు కిశోర్‌ సింగ్‌, వేణుగోపాలరావు, పుల్లారావు పాల్గొన్నారు.