ప్రజాశక్తి - రంపచోడవరం
స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్లో 11 మండలాలకు సంబంధించిన వందమంది సచివాలయాల ఆపద మిత్రలకు ఈనెల 12 నుండి 25వ తేదీ వరకు నిర్వహించిన శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే మాట్లాడుతూ ఏజెన్సీలో పకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణ సహాయం చేసేందుకు ఆపదమిత్రలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 12 శాఖల ద్వారా ఏయే సహాయ కార్యక్రమాలు చేపట్టవచ్చో ఇక్కడి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం శిక్షణ పొందిన వందమందికి ఐడెంటి కార్డులు, సర్టిఫికెట్లు, పకృతి వైపరీత్యాల సహాయక చర్యలు చేపట్టేందుకు కిట్లు ప్రాజెక్ట్ అధికారి చేతులు మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కె.కోటేశ్వరరావు, ఏడిఎం అండ్ హెచ్‌వో డాక్టర్ అనూష, డిటిఎంలు పి.వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, డిపిఎం కిరణ్మయి, వైటీసీ మేనేజర్ సుధీష్ పాల్గొన్నారు.










