Nov 04,2023 23:13

ప్రజాశక్తి-మండపేట
మండపేట పట్టణంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్ల అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె.కష్ణవేణి అధ్యక్షతన చేపట్టిన జిల్లా అంగన్వాడీల మొదటి మహాసభ శనివారంతో ముగిసింది. తొలుత అంగన్‌వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ చల్లా రవికుమార్‌, కష్ణవేణి తదితరులు సిఐటియు జెండాను ఆవిష్కరించారు. అనంతరం 33 మందితో జిల్లా నూతన కార్యవర్గ ఎంపిక జరిగింది. అధ్యక్షురాలిగా బండి వెంకటలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా కె.కృష్ణవేణి, ట్రెజరర్‌గా పరమట అమూల్య ఎంపికయ్యారు. పలువురు మాట్లాడుతూ జిల్లా నూతన కార్యవర్గం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. పెరిగిన ధరలతో అరకొర వేతనాలతో సకాలంలో అందని జీతాలతో అంగన్‌వాడీలు అష్ట కష్టాలు పడుతున్నారని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్ల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ అన్నారు. ఈ సభలో ఐసిడిఎస్‌లో వస్తున్న మార్పులు అంగన్‌వాడీల సమస్యలు చర్చించమన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు అంగన్‌ వాడీలకు గ్రాడ్యుటీ ఇవ్వాలని గర్భిణులు, బాలింతలకు పెట్టిన యాప్‌ ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. నేటికీ 5వ తేదీ వచ్చిన అనేక అంగన్‌వాడీ కేంద్రాలకు ఇంకా సరుకులు అందలేదన్నారు. సమస్యల పరిష్కారానికి డిసెంబర్‌లో సెంటర్లు మూసివేసి నిరవధిక సమ్మె చేపడతామన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శులు నూకల బలరాం, అంగన్‌వాడీి సిఐటియు నాయకులు రాణి, వెంకట దుర్గా, లక్ష్మి, సుజాత, నూకరత్నం, ఆదిలక్ష్మి, గంగాభవాని, బేబీ, సత్యవేణి, నరేంద్ర కుమార్‌, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.