ప్రజాశక్తి - రాజమహేంద్రవరం గత రెండు రోజులుగా ప్రభుత్వ అటానమస్ కళాశాలలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కమిషనరేట్ మంగళగిరి అధ్వర్యంలో జరుగు తున్న అకడమిక్ ఆడిట్ మంగళవారంతో ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.రామచంద్ర రావు తెలిపారు. గత రెండు విద్యా సంవత్సరాలకుగాను నిర్వహించిన విద్యా కార్యక్రమాల మదింపునకు ఎస్‌డి మదీనా, ఎస్‌ఆర్‌బి.చక్రవర్తి, కె. భద్రాచలం, కె.ఆనంద రావులతో కూడిన బందం రెండుగా విడిపోయి కళాశాలలోని వివిధ విభాగాలు, విద్యార్థి సహాయక విభాగాలు, పరిశోధన, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, వివిధ క్లబ్బులు, జెకెసి, పరీక్షల విభాగం, క్రీడల విభాగం పని తీరు, వివిధ ఫైళ్ళను క్షుణ్ణంగా సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఇతర ఏజెన్సీలతో అవగాహన ఒప్పందాలను చేసుకోవాలని, అదేవిధంగా అంకుర ప్రోజెక్ట్‌లను మరిన్నింటిని చేపట్టాల్సిన అవసం ఉందని సూచించారని చెప్పారు. ఖచ్చితంగా నాక్‌లో Aంం సాధించే సత్తా ఈ కళాశాలకు ఉందన్నారని తెలిపారు. ఈ బృందం సభ్యులను సత్కరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీశైల శాస్త్రి, ఐక్యుఎసి సమన్వయ కర్త డాక్టర్ అన్నపూర్ణ, సమన్వయకర్త డాక్టర్ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.