Aug 02,2023 23:46

ప్రజాశక్తి-ఏలేశ్వరం ఏలేశ్వరం నగర పంచాయతీలో వైసిపికి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవలే 14వ వార్డు కౌన్సిలర్‌ మోదీ నారాయణస్వామి వైసిపి రాజీనామా చేసి టిడిపిలో చేరగా బుధవారం మరో నలుగురు పార్టీకి రాజీనామా చేశారు. 4వ వార్డ్‌ కౌన్సిలర్‌ బొదిరెడ్డి గోపాలకృష్ణ, 6వ వార్డు కౌన్సిలర్‌ కోణాల వెంకటరమణ, 18వ వార్డ్‌ కౌన్సిలర్‌ ఎండగుండి నాగబాబు తమ అనుచరులతో కలిసి వైసిపికి రాజీనామా చేశారు. వీరు ఈనెల ఏడో తేదీన ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఏలూరు రిజర్వాయర్‌ పరిశీలనకు వస్తున్న టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరన్నట్టు తెలిపారు. ఏలేశ్వరంలో 20 వార్డులు ఉండగా 5 వార్డులు టిడిపి, 15 వార్డులు వైసిపి గెలుపొందాయి. వైసిపి నుండి నాలుగు వార్డు కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో 11 వార్డు కౌన్సిలర్లు ఉండగా వారిలో కూడా ఇద్దరు కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వారు కూడా వైసిపిని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.