ముగ్గురు ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు
ముగ్గురు ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు
ప్రజాశక్తి -చౌడేపల్లి :మండలంలోని ముగ్గురు ఉపాధ్యాయులు ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారికి అవార్డులు దక్కాయి. ఈ మేరకు గురువారం కడప జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో కాగిత నుంచి ఏవి సుబ్రహ్మణ్యం, చౌడేపల్లి ఉన్నత పాఠశాల నుంచి ఏ భారతి పందిళ్ళపల్లి నుంచి టి నాగరాజులు కలెక్టర్ నుంచి ఉత్తమ అవార్డులు అందుకున్నారు. మండలంలో ముగ్గురు ఉపాధ్యాయులకు ఇంతటి గౌరవం దక్కడం పట్ల ఉపాధ్యాయులు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.










