Oct 18,2023 00:01

మాట్లాడుతున్న డిఎం అండ్‌ హెచ్‌ఒ డాక్టర్‌ బి.రవి

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మాతృ మరణాలపై జిల్లాస్థాయి సమీక్షను జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి (డిఎంహెచ్‌ఒ) డాక్టర్‌ బి.రవి ఆన్‌లైన్‌ ద్వారా మంగళవారం నిర్వహించారు. చండ్రాజుపాలెం, నాదెండ్ల, యడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో సంభవించిన 3 మాతృమరణాలపై సమీక్షించారు. సంబంధిత వైద్యాధికారులు, కాన్పులు చేసిన ప్రైవేటు వైద్యశాల గైనకాలజిస్ట్‌, మత్తు వైద్యులు, చిన్నపిల్లల వైద్యులను విచారణ చేసి మరణాలకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో పునరావృతం కానివ్వొద్దని హెచ్చరించారు. గర్భిణులు పోషకాహారం తీసుకునేలా, తగిన సమయానికి అన్ని పరీక్షలూ చేయించుకునేలా ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ బి.రంగారావు, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ జి.చంద్రశేఖర్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ గీతాంజలి, డాక్టర్‌ నాగపద్మజ, డాక్టర్‌ మంత్రు నాయక్‌, డాక్టర్‌ వసంతరాయ, డాక్టర్‌ సింధూజ, డాక్టర్‌ దయానిధి, డాక్టర్‌ జయంతి, జిజిహెచ్‌ హెచ్‌ఒడి అరుణ, ఐసిడిఎస్‌ పీడీ బి.అరుణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.