Aug 16,2023 20:39

ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

రైల్వేకోడూరు : బాలుపల్లె రేంజ్‌ అటవీశాఖ పరిధిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు బాలుపల్లె రేంజ్‌ ఎఫ్‌ఆర్‌ఒ టి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు బాలుపల్లి సెక్షన్‌లోని బాలుపల్లె వెస్ట్‌బీట్‌ పరిధిలో దాడులు నిర్వహించి తమిళనాడుకు చెందిన సడియన్‌ చిన్న ఆండే, నటేషన్‌, శ్రీనివాసన్‌ అనే ముగ్గురిని అదులోకి తీసుకున్నామన్నారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి లక్ష రూపాయలు విలువ చేసే పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో డిఆర్‌ఒ ఎస్‌.చంద్రకళ, ఎఫ్‌ఎస్‌ఒ ఎం.బాల చంద్రుడు, ఎఫ్‌బిఒఆర్‌ సుబ్బలక్ష్మి, ఎం సుధాకర్‌, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
అరెస్టయిన ఎర్రచందనం స్మగ్లర్లతో ఎఫ్‌ఆర్‌ఒ, అటవీశాఖ సిబ్బంది