ప్రజాశక్తి- మధురవాడ : వైఎస్‌ఆర్ కాలనీ వరసిద్ధి వినాయక మండపం వద్ద రాక్‌స్టార్ బార్సు ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అధికసంఖ్యలో మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని, వినాయక మండల ప్రాంతమంతా రంగురంగుల రంగవల్లులతో నింపేశారు. విజేతలకు కార్పొరేటర్ మొల్లి హేమలత, రమణ దంపతులు బహుమతులను అందజేశారు. ఆలాగే పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ఉత్సవ కమిటీ ప్రోత్సాహక బహుమతులను అందించింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ, వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉత్సవ నిర్వహణకు అన్ని విధాల సహకరించిన టిడిపి బిసి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, కార్పొరేటర్ హేమలత, రమణ దంపతులకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఓలేటి శ్రావణ్, మొకర రవికుమార్, వియ్యపు నాయుడు, మోహన్ పాల్గొన్నారు.










