ప్రజాశక్తి-శింగరాయకొండ : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శింగరాయకొండలోని లోటస్ హైస్కూల్‌లో శాస్త్రీయ దక్పథ దినోత్సవం అనే అంశంపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎస్.సునీల్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.హరిబాబు మాట్లాడుతూ ప్రతివిద్యార్థి, ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలన్నారు. సజనాత్మక ఆలోచనలు పెంపొందించుకొనేందుకు కషి చేయాలన్నారు. మూఢ విశ్వాసాల నిర్మూలనకు, జీవితాంతం కషి చేసిన, డాక్టర్ నరేంద్ర అచ్యుత దబోల్కర్ అమరుడైన రోజు, ఆగస్టు 20, జాతీయ దక్పథ దినోత్సవం దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మూఢ విశ్వాసాల నిరోధక చట్టం మహారాష్ట్రలో వచ్చింది. ఆ తర్వాత ఈ చట్టం కర్ణాటకలోనూ వచ్చింది. ప్రజలను మోసగిస్తున్న దొంగ బాబాలకు వ్యతిరేకంగా, నరబలులు, క్షుద్ర పూజలు, చేతబడులు పేరుతో జరుగుతున్న మోసాలను బట్టబయలు చేసిన డాక్టర్ నరేంద్ర అచ్యుత దబోల్కర్‌ను 2013 ఆగస్టు 20న వాకింగ్ సమయంలో మతోన్మాదులు హత్య చేసినట్లు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ నక్కా శ్రీనివాసులు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలన్నారు. మూఢనమ్మకాలు, శాస్త్రీయ దక్పథం కలిగి ఉండాలన్నారు. జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి కోటపాటి నారాయణ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎంఇఒ ఎం.నరసింహారావు, విశ్రాంత ఉపాధ్యాయులు నర్రా యలయంద, పిచ్చమ్మ, భాస్కర్, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










