అవగాహన కల్పిస్తున్న సీఐ జీడీ బాబు
ప్రజాశక్తి-అరకులోయ రూరల్:'మీ కోసం మీ పోలీసు' కార్యక్రమంలో భాగంగా అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిఐ జీడి బాబు మూఢనమ్మకాలు, గంజాయి మత్తు పదార్థాలతో కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ జీడి బాబు మాట్లాడుతూ, గిరిజనులు అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి వెళ్లాలని, నాటు వైద్యం చేయించుకుని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దన్నారు. డబ్బులకు ఆశపడి గంజాయి సాగు, విక్రయాలు, రవాణా చేసి యువత భవిష్యత్ నాశనం చేసుకోవద్దన్నారు.










