Aug 27,2023 21:20

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌

 జమ్మలమడుగు రూరల్‌ : సైన్స్‌ పరంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుతం కాలంలో మూఢ నమ్మకాలను వీడాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని శాఖా గ్రంథాలయ సమా వేశపు హాలులో జెవివి 17వ జిల్లా మహాసభలు నిర్వహించారు. కార్యక్ర మానికి మాజీ ఎమ్మెల్సీతోపాటు వైవీ యూ ప్రొఫెసర్‌ వెంకటరామిరెడ్డి, జెవివి సీనియర్‌ నాయకులు వెంక టేశ్వర్లు, డాక్టర్‌ కల్పన హాజరయ్యారు. ఈ ముందుగా జెండాను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సైన్స్‌, శాస్త్రీయ దృక్పథంపై వివరించారు. విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ ఆలోచనలు పెరగాలని తెలిపారు. చంద్రయాన్‌-3ను విజయ వంతంగా ప్రయోగించినా దాని చుట్టూ మూఢనమ్మకాలను అల్లడం దురదృష ్టకరమని చెప్పారు. నేటి కాలంలో జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థల ప్రాధా న్యత, అవ సరం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సైన్స్‌ పలితాలు సామా న్యులకు చేరవే యడంలో జనవిజ్ఞాన వేదిక ముందు ఉందని చెప్పారు. ఆహార పదార్థాలలో వాడే రంగులు ఆరోగ్యానికి హానిక రమన్నారు. కార్యక్ర మంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్య క్షులు రాజశేఖర్‌ రాహుల్‌, రాష్ట్ర నాయ కులు తవ్వా సురేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏడి దేవదత్తం, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరాములు, సుజన్‌కుమార్‌ , హన్నా ఎస్తేర్‌, వివిధ మండల జిల్లా నాయకులు సునీత, కామేశ్వరమ్మ, పి.కిరణ్‌, యూత్‌ నాయకులు కిరణ్‌, శివరాం, నంగా రాజేష్‌, డా.చక్రదర్‌, ప్రొద్దుటూరు సునీత, మురుకూటి సూర్యనారాయణ రెడ్డి, సుప్రదీప్‌ పాల్గొన్నారు.