Feb 05,2023 23:58

అవగాహన కల్పిస్తున్న హీరో శ్రీకాంత్‌

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:అల్లూరి జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఆదేశాల మేరకు మీకోసం మీ పోలీస్‌ అనే కార్యక్రమంలో భాగంగా అరకు సిఐ జీడి బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలోని మాడగడ పంచాయతీ గంగుడి గ్రామంలో మీ కోసం మీ పోలీస్‌ అనే కార్యక్రమంలో సినీ నటుడు హీరో శ్రీకాంత్‌, హీరో రాహుల్‌, హీరోయిన్‌ శ్రీవాణి ఆదివారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ, మూడ నమ్మకాలతో గిరిజనులు ప్రాణాలు పోగొటుకుంటున్నారన్నారు. మూడ నమ్మకాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, నాటు సారా విక్రయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.