Oct 27,2022 23:21

పార్కులో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మేయర్‌ హరివెంకట కుమారి

ప్రజాశక్తి - ఆరిలోవ : ముడసర్లోవ పార్కులో అభివృద్ధి పనులను జివిఎంసి మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి గురువారం సాయంత్రం పరిశీలించారు. కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఆడుకునేందుకు రూ.23 లక్షలతో ఇటీవల ఆట వస్తువుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆ పనులను పరిశీలించిన ఆనంతరం ఆమె మాట్లాడుతూ ఇప్పటికే ముడసర్లోవ రిజర్వాయర్‌ భూముల పరిరక్షణకు ప్రహరీ నిర్మించేందుకు రూ.10 కోట్లుకు ఆమోదం తెలిపినట్టు తెలిపారు. ముడసర్లోవ పార్కును అంచెలంచెలుగా అభివృద్ధి చేసేందుకు మరిన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మరో రూ.1.98 కోట్లతో పార్కులో రాక్‌ పార్కు, ఫౌంటైన్‌ ఏర్పాటుచేస్తామని చెప్పారు. పార్కు నిర్వహణకు త్వరలో సిబ్బందిని నియమించే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి పార్క్స్‌ ఇఇ ప్రసాదరావు, ఎఇ సురేష్‌, వార్డు వైసిపి ఇన్‌ఛార్జి కెల్ల సత్యనారాయణ, వైసిపి నాయకులు పిల్లి వీర్రాజు, వెంకట రెడ్డి, పాండ్రంకి శ్రీను తదితరులు పాల్గొన్నారు.