Oct 22,2022 23:53

ఆట సామగ్రి ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్న మేయర్‌, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌

ప్రజాశక్తి - ఆరిలోవ : ముడసర్లోవ పార్కుకు తిరిగి పూర్వ వైభవం తీసుకు రావడంతో పాటు అంతర్జాతీయ పార్కుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయ నిర్మల తెలిపారు. ముడసర్లోవ పార్కులో రూ.23 లక్షలతో పిల్లల ఆట సామగ్రి ఏర్పాటుకు 13వ వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీత ఆధ్వర్యాన శనివారం మేయర్‌, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకొని పార్కులో చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఆటసామగ్రిని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీత మాట్లాడుతూ, పార్కును అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన మేయర్‌, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ బి.రాము, ఎఇ అప్పాజీ, సురేష్‌, వైసిపి నాయకులు మోహనరావు, పిల్లి వీర్రాజు, వెంకటరెడ్డి, గోవిందు, డాక్టర్‌ ఆర్‌ఎస్‌.నాయుడు తదితరులు పాల్గొన్నారు.