May 16,2023 22:00

కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన సామర్లకోట నాయకులు


ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
కాకినాడ మాజీ ఎంపి ముద్రగడ పద్మనాభంను సామర్లకోటకు చెందిన పలువురు నాయకులు మంగళవారం కలిశారు. కిర్లంపూడి లోని ముద్రగడ గృహంలో ఆయ నను కలిసి పలు విషయాలపై చర్చించారు. ముద్రగడ తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు ఇటీవల వచ్చిన వార్త కథనాలపై సామర్లకోట పట్టణానికి చెందిన భారత్‌ మాతా సేవ పరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షులు గొరకపూడి చిన్నయ్య దొర, ప్రముఖ డాక్టర్‌ పసల సత్యానందరావు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ గోలి వెంకట అప్పారావు చౌదరి, తదితరులు ముద్రగడను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అయితే తాను రాజకీయాల్లోకి తిరిగి వస్తున్న విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ముద్రగడ స్థానిక నాయకులకు తెలిపారు. కార్యక్రమంలో పట్టణా నికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.