ప్రజాశక్తి - ముదినేపల్లి
స్థానిక జెడ్‌పి స్కూలులో బుధవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం జరిగింది. 2002-2003 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులంతా ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేశారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులు రాంబాబు, వై.విజయకుమార్, విజయలక్ష్మి, పద్మావతి, బాలకృష్ణలను సత్కరించారు. దినేష్, వనిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.










