Aug 07,2023 19:48

పశువులను వ్యాక్సినేషన్‌ చేస్తున్న అధికారులు

ప్రజాశక్తి - హోళగుంద
మండలంలోని చిన్నహ్యాట గ్రామంలో పశువులకు ముద్ద చర్మపు వ్యాధి నిరోధక వ్యాక్సినేషన్‌ను పశుసంవర్థక శాఖ, రిలయన్స్‌ ఫౌండేషన్‌, ఆర్డిప్‌ సంస్థల ఆధ్వర్యంలో సోమవారం చేపట్టారు. పశువులు కలిగిన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ వెటర్నరీ అసిస్టెంట్‌ జిలాన్‌ బాష కోరారు. రైతులు పశువుల సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలకు రిలయన్స్‌ ఫౌండేషన్‌, ఆర్డిప్‌ స్వచ్ఛంద సంస్థలు తమ సహాయ, సహకారాలను అందిస్తాయని, వివిధ ప్రభుత్వ సంస్థలను సమన్వయ పరుస్తుందని నాగరాజు తెలిపారు. 60 జతల ఎడ్లకు, ఆవులకు వాక్సినేషన్‌ చేసినట్లు చెప్పారు.