ప్రజాశక్తి - నెల్లూరు : జిల్లాలో మత్య్ససందపను వద్ధి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తోపాటు మార్కెటింగ్ సదుపాయాలపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్ బాబు అధ్యక్షతన ప్రధాన మంత్రి మత్స్య యోజన పథకం పై జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా జిల్లాలో మత్స్య సంపదను వృద్ధి చేయడంతో పాటు మత్య్సకారుల ఆర్థికాభివద్ధికి కషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై మత్స్య కారుల్లో అవగాహన కల్పించి ఔత్సాహిక మత్స్యకారులను ప్రోత్సహించి వారి ఆర్థికా భివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్య శాఖ జెడి శ్రీ నాగేశ్వర రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిరంజీవి, డి ఆర్ డి ఏ పిడి సాంబ శివారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సుధాకర్ రాజు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సిఇఒ శంకర బాబు, ఎల్.డి.ఎం శ్రీకాంత్ ప్రదీప్ కుమార్ ఉన్నారు.










