Sep 03,2023 00:37

మాట్లాడుతున్న ఎఎస్‌పి

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌: విద్యార్ధులు, యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎఎస్పీ కె ధీరజ్‌ సూచించారు. మండల కేంద్రంలోని పర్యటించి ప్రవేట్‌ దండకారణ్య జూనియర్‌ కళాశాలను అకస్మాత్తుగా సందర్శించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ, విద్యార్థి దశలో చదువుకుని మంచి భవిష్యత్‌ చక్క దిద్దుకోవాలన్నారు. గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అరకులోయ సిఐ సిహెచ్‌ రుద్రశేఖర్‌, ఎస్‌ఐ ఆర్‌.సంతోష్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసు పాల్గొన్నారు.