ప్రజాశక్తి-వన్‌టౌన్: విద్యార్థులు మత్తు పదార్ధాలు (డ్రగ్స్) బారిన పడకుండా వాటికి దూరంగా ఉండాలని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో డీఎస్పీ డి. ప్రభాకర్ తెలిపారు. వన్‌టౌన్ కొత్తపేటలో గల పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎన్‌యస్‌యస్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వద్ద - జీవితం మద్దు అనే అంశంపై డ్రగ్ అవేర్‌నెస్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో డీఎస్పీ డి. ప్రభాకర్, భవానీపురం సిఐ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ వాడటం వల్ల తమ జీవితాలు సర్వ నాశనం అవుతాయని, వాటికి అలవాటు పడకుండా దూరంగా ఉండాలని కోరారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించినట్లయితే తమకు సమాచారం అందించాలని తెలిపారు. టోల్ ఫ్రీ నెం. 14500కు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి కె. లక్ష్మణస్వామి గురు, ప్రిన్సిపాల్ డా. జె.లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ ఎ.పతంజలి శాస్త్రి, డాక్టర్ ఎస్ మణికంఠ, ఎ.రమాదేవి, ఎన్‌ఎసఎస్ కో-ఆర్డినేటర్ ఎం.నవీన్‌కుమార్ పాల్గొన్నారు.










