ప్రజాశక్తి-జగ్గయ్యపేట
మత్తు పదార్థాల వైపు వెళ్లి జీవితాలను చిత్తు చేసుకోవద్దని జగ్గయ్యపేట సిఐ ఎ. నాగమురళి అన్నారు. పట్టణంలోని జేఆర్సి జూనియర్ కళాశాలలో బుధవారం మాదకదవ్యాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ మురళి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలన్నారు. చిన్నతనం నుండే మత్తు పదార్థాలు గుట్కాలు గంజాయి లిక్కర్ వంటి వాటి వైపు వెళ్ళవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఎస్సై బీవీ రామారావు, జెఆర్సి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్, అధ్యాపకులు దుర్గాప్రసాద్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే చిల్లకల్లు పోలీస్ ఆధ్వర్యంలో 'డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ దిశగా' అనే కార్యక్రమం పై మండలంలోని చిల్లకల్లు జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు చిల్లకలు ఎస్సై దుర్గ ప్రసాద్ అవగాహన కల్పించారు. చిల్లకల్లు మహిళా పోలీసులు పూర్ణిమ, పవిత్ర, స్కూల్ హెచ్‌ఎం వెంకటేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు.










