మాట్లాడుతున్న వన్‌టౌన్ సిఐ వెంకటరావు
ప్రజాశక్తి-విజయనగరం : విద్యార్థులు మత్తు పదార్థాలతో చిత్తు కావద్దని విద్యార్థులకు వన్ టౌన్ సిఐ బి.వెంకటరావు సూచించారు. శనివారం నగరంలోని బిపిఎం పాఠశాల విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడితే విచక్షణ కోల్పోయి, తామేమీ చేస్తున్నామన్న విషయం మరిచి, నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని చదువుపై దృష్టి పెట్టి, తల్లిదండ్రుల కలలను నిజం చేయాలన్నారు. కార్యక్రమంలో వన్‌టౌన్ ఎస్‌ఐ ఎస్.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.










