Aug 26,2023 19:21

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-ఉలవపాడు:ఉన్నతధికారుల ఆదేశాలు మేరకు కందుకూరు స్పెషల్‌ ఇన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో స్టేషన్‌ వారి ఆధ్వర్యంలో మాదకద్రవ్యల నివారణలో భాగంగా ఉలవపాడులోని పభుత్వ హైస్కూల్లో శనివారం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హైస్కూల్‌ విద్యార్థులతో పాటు ఎమ్‌.ఇఒ. పి. వి. రమణయ్య, హెడ్‌ మాస్టర్‌ ఒ. ఆదిశేషయ్య, ఉపాధ్యాయులు వి. వి. సుధాకర్‌,ఆర్‌.ఫణి రాజు,కె. మానస, కె. అశ్విని పాల్గొని తమ సందేశాలు అందజేశారు. ఎస్‌ఇబి ఇన్‌స్పెక్టర్‌ డి వెంకటేశ్వర్లు మాట్లాడారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఎస్‌ఇబి ఇన్‌స్పెక్టర్‌ డి. వెంకటేశ్వర్లు తో పాటు హెడ్‌ కాన్స్టేబుల్‌ ఎస్‌. కె. మహబూబ్‌ బాషా, కానిస్టేబుల్‌ ఎస్‌. కె పోలీస్‌ బాషా ఉన్నారు.