మాట్లాడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్
మాట్లాడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్
మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి
ప్రజాశక్తి-కావలి:కావలిలో బుధవారం స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ''మత్తు పదార్ధాలు సేవించుట వల్ల కలిగే దుష్ఫలితాల'' గురించి అవగాహన సదస్సును ఎన్‌ఫోర్స్ మెంట్ సూపరింటెండెంట్, ఎస్. రవి కుమార్ ఆధ్వర్యంలో పట్టణం లోని జవహర్ భారతి జూనియర్ కాలేజీలో జరిగింది. ఈసదస్సులో కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, సైక్రియాటిక్ డాక్టర్ ''అఖిలేష్, జవహర్ భారతి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ రాజ్ , కావలి స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో స్టేషన్ ఇన్‌స్పెక్టర్,కె .శ్రీనివాసరావు, మెడికల్ హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.










