Nov 29,2020 12:27

మట్టిలోనే పుట్టాము
మట్టిలోనే కలుస్తాము
మధ్యలో రంగుల ఆర్భాటాలెందుకు?
రసాయనాలు నీటిలో కలుపుతూ
జలచరాలకు ముప్పుతేవడమెందుకు?
ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో
ధరణికి అజీర్తిని ఆపాదించడమెందుకు?
ప్రకృతితో మమేకమవుతూనే
మనుగడ సాగిద్దాం!
కాలుష్య కారకాల
వాడకం తగ్గించి
కాగితపు సంచుల
ఉపయోగం పెంచి
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం!
సహజత్వాన్ని పెంచి
పరిశుభ్రతను పాటిస్తూ
ప్రకృతిని పచ్చగా బతకనిద్దాం!!

                                   * అయిత అనిత, 8985348424