
ప్రజాశక్తి - వీరవాసరం
పర్యావరణానికి మేలు చేసే మట్టి విగ్రహాలతో వినాయక చవితిని జరుపుకోవాలని తోలేరు ప్రధానో పాధ్యాయుడు విఎంజెడ్.శ్రాంప్రసాద్ విద్యార్థులకు సూచిం చారు. ఈ మేరకు శనివారం మట్టి విగ్రహాలను ప్రోత్సహించే విధంగా విద్యార్థులతో మట్టి విగ్రహాలను తయారు చేయిం చారు. ఈ నెల 17వ తేదీ ఆదివారం మట్టి విగ్రహాలను ఉచితంగా అందించనున్నట్లు జెడ్‌పిటిసి సభ్యులు గుండా జయప్రకాష్‌నాయుడు తెలిపారు. ఈ విగ్రహాలను యునైటెడ్ కాపు క్లబ్, కాపు వనిత ఆధ్వర్యంలో వీరవాసరం బస్టాండ్ వద్ద అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పాలకొల్లు : పాలకొల్లు ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థులకు శనివారం మట్టి వినాయక ప్రతిమల తయారీ పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహక బహుమతులు అందించారు. కళాశాల ఛైర్మన్ కెవిఆర్.నరసింహరావు, కార్యదర్శి కలిదిండి రామరాజు చేతులమీదుగా సర్టిఫికెట్స్, మెడల్స్ బహూకరించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్లీనంగా నిబిడీకృతమై ఉన్న వివిధ కళా నైపుణ్యాన్ని, పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, విఘ్నేశుడు ప్రతి రూపాన్ని ఏ రూపంలో తయారుచేసినా అందంగానే ఉంటుందని, విద్యార్థులు ప్రదర్శించిన వివిధ వినాయక రూపాలను చూసి విద్యార్థులను ప్రశంసించారు. రామరాజు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు సాంస్కృతిక, కళప్రావీణ్యం సంపాదించుకోవడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత, వివిధ పండుగల విశిష్టతను విద్యార్థుల్లో లౌకికత, భిన్నత్వంలో ఏకత్వం చాటి చెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.
తణుకు : వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక మాంటిస్సోరి స్కూలులో విద్యార్థులు శనివారం వినాయక ప్రతిమలను తయారుచేసి ప్రదర్శించారు. స్కూలు డైరెక్టర్ అనపర్తి ప్రకాష్‌రావు ప్రతిమలను పరిశీలించారు. తల్లిదండ్రులు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారి సృజనాత్మకతను ప్రదర్శించారని అభినందించారు. ప్రముఖ సిద్ధాంతి వెలవలపల్లి చంద్రశేఖర్, అధ్యాపకురాలు అమృతవల్లి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. లయన్స్ క్లబ్ జిల్లా డిప్యూటీ క్యాబినెట్ సెక్రటరీ వావిలాల సరళాదేవి వెంకటరమేష్ దంపతుల ఆర్థిక సహకారంతో జిల్లాలోని అన్ని క్లబ్బులకు వినాయక ప్రతిమలను శనివారం అందిం చారు. ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ గవర్నర్ గట్టిం మాణి క్యాలరావు, టిఎస్.పద్మావతి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఉండి :ఉండి రాజులపేటలోని శ్రీ శశి హైస్కూల్‌లో విద్యార్థులు మట్టి వినాయకుని ప్రతిమలు తయారుచేశారు. స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : శశి ఇంజినీరింగ్ కళాశాల రెడ్ యాంట్స్, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా గణేష్‌నగర్ ప్రజలకు కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మట్టి విగ్రహాలను శనివారం ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల వాలంటీర్లను వైస్ ఛైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, ప్రిన్సిపల్ మొహ్మద్ ఇస్మాయిల్, వివిధ విభాగాల డీన్లు, విభాగాధిపతులు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సూచన మేరకు త్రిఎఫ్ ఇండిస్టీ వారి ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ కార్మికులకు, సిబ్బందికి మట్టి విగ్రహాలు పంపిణీ చేసినట్లు సిఎస్‌ఆర్ అసిస్టెంట్ మేనేజర్ జి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్(ఆపరేషన్) ఎస్.రామలిం గేశ్వరశర్మ, హెచ్‌ఆర్ జిఎమ్.జనార్దన్, హెచ్‌ఆర్ మేనేజర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి.లక్ష్మీసరోజ పాల్గొన్నారు.
నరసాపురం టౌన్ : మండలంలోని సీతారామపురంలో స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఎఐఎంఎల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐఎంఎల్ హెచ్‌ఒడి డాక్టర్ బొమ్మ రామకృష్ణ మాట్లాడారు. కళాశాల ఛైర్మన్ కొండవీటి సత్యనారాయణ, ట్రెజరర్ కెవి.స్వామి, డైరెక్టర్ ఎ.శ్రీహరి విద్యార్థులను అభినందించారు.
పెనుగొండ : స్థానిక శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో శనివారం గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మట్టి విగ్రహాలను తయారుచేసే పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి.సత్యనారాయణ, ఎఒ సాయి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.