ప్రజాశక్తి - నందవరం
మట్టి నమూనాల సేకరణను ప్రతి రైతూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మిగనూరు ఎడిఎ మహ్మద్ ఖాద్రీ తెలిపారు. శనివారం మట్టి నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మట్టినమూనా పరీక్ష కోసం కెవికె బనవాసి కేంద్రానికి వెళ్లి చేయించుకునే వారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం ఆర్‌బికె స్థాయిలోనే రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఒక్కో ఆర్‌బికెకు 22 మంది రైతుల మట్టి నమునాలు సేకరించాలని లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. మట్టి నమూనా సేకరణ పరిశీలించి సిబ్బందికి తగు సలహాలు, సూచనలు ఇచ్చామన్నారు. క్యూఆర్ కోడ్ ఆధారం చేసుకుని మట్టినమూనాలు తీసేందుకు సిబ్బందికి శిక్షణ ఇది వరకే ఇచ్చామని, రైతులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎఒ స్రవంతి, ఎఇఒ సురేంద్ర గౌడ్, ఆర్‌బికె సిబ్బంది వెంకటేష్, త్రివేణి, రామలక్ష్మి, జ్యోతి, రైతులు పాల్గొన్నారు.
మట్టి నమూనాను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు










