
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:మండలంలో అక్రమంగా మట్టి, గ్రావెల్ తవ్వకాలు విపరీతంగా జరుగుతున్నాయని, ఎమ్మెల్యే అనుచరులు వీటికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు విమర్శించారు. బలిఘట్టం బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవాలయ సమీపంలోని విశాఖ రుషికొండ మాదిరిగా తయారు చేశారని సెల్ఫీ ఫోటోతో విమర్శించారు. పవిత్ర ఆధ్యాత్మిక ప్రాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే బలిఘట్టం ప్రాంతంలో చిద్గదానంద ఆశ్రమ ప్రాంతంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు తవ్వి వైసిపి నాయకులు జేబులు నింపుకుంటున్నారని తెలిపారు. ఆఖరికి ప్రకృతిని కూడా వైసీపీ నాయకులు వదలలేదని విమర్శించారు. ఇప్పటికైనా మైనింగ్, పోలీసులు, రెవెన్యూ అధికారులు దృష్టి సారించి అక్రమార్కులను అరికట్టాలని ఆయన తెలిపారు.