Jun 14,2023 23:39

ఎంపిడిఒ రమ్యకు ఫిర్యాదు చేస్తున్న నడింపాలెం ఎంపీటీసీలు

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండల పరిధిలోని నడింపాలెంలో ఆ గ్రామ సర్పంచ్‌ మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నా రని అదే గ్రామానికి చెందిన నడింపాలెం- 1 ఎంపీటీసీ వాసి మల్ల మాణిక్యరావు, నడింపాలెం-2 పూర్ణిమ వెంక టేశ్వరరావు మండల పరిషత్‌ లోని ఎంపీడీవో శ్రీ రమ్యకు బుధవారం ఫిర్యాదు చేశారు. గ్రామంలో పలు చోట్ల మట్టి అక్రమ తవ్వకాలు స్వయానా గ్రామ సర్పంచ్‌ చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో జగనన్న కాలనీ పక్కన దాదాపు తాడిచెట్టు ఎత్తు మట్టి తవ్వకాలు చేశారని, ఇప్పుడు మరొక చోట తవ్వకాలు చేస్తూ ట్రక్కుకి రూ.1000 నుంచి రూ.1200 వసూలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొనానరు. వారిపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో తమ పదవులకు రాజీనామా చేస్తామని అన్నారు. ఇదిలా ఉండగా గొట్టిపాడులో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతుండగా ఆ గ్రామ సర్పంచ్‌ ప్రత్తి పాటి మరియరాణి ఆ ప్రదేశానికి వెళ్లి వాటిని ఆపేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక జడ్పిటిసి అక్రమ మట్టి తవ్వకాలు ఆపకపోతే రాజీనామా చేస్తానని అన్నారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసు కోకపోవడం గమనార్హం.