Apr 02,2023 23:00

ప్రజాశక్తి-జగ్గయ్యపేట : మత్స్య శాఖ అభివద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. మండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేట గ్రామంలోని చెరువులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 1 లక్ష 75 వేల చాప పిల్లలను ఉదయభాను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లా డుతూ రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం, అభివద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాలలో చెరువులను అభివద్ధి చేస్తూ మత్స్యశాఖ ఆధ్వర్యంలో చాప పిల్లలను పెంపకందారులకు అందిస్తున్నామని అన్నారు. మత్స్యకారులకు చేపలు పట్టేందుకు వలలు, పడవలను అర్హత బట్టి ఇస్తున్నామని తెలిపారు. మత్స్యసంపద ఎగుమతుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని అన్నారు. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు జొన్నబట్ల సతీష్‌ శర్మ, నాయకులు చలమల శ్రీను, కాకనబోయిన ఆదినారాయణ పాల్గొన్నారు.