ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని మఠం పంచాయతీలోని ప్రముఖ పుణ్య క్షేత్రం మత్స్య గుండం లో మత్స్యలింగేశ్వర స్వామిని పాడేరు సబ్ కలెక్టర్ వీ అభిషేక్, తన తండ్రితో కలిసి ఆదివారం స్వామి వారిని దర్శించుకున్నారు. రెండు కంచు దీపపు కుంధులను దేవాలయ కమిటీకి అందించారు. సబ్ కలెక్టర్ అభిషేక్ కు తహశీల్ధార్ రాజ్యలక్ష్మి సన్మానించారు. స్వామి వారి చిత్ర పటాన్ని ఆలయ కమిటీ సభ్యులు అందించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, పురాతన కాలం నుంచి పేరును గాంచిన మత్స్య లింగేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్‌ఐ రంగారావు, వీఆర్వో రెడ్డి సూర్య ప్రకాష్, మఠం సర్పంచ్ సోమేలి శాంత కుమారి, ఆలయ కమిటీ సభ్యులు పాంగి మత్స్య కొండ బాబు, మఠం సింహాచలం నాయుడు ఉన్నారు.










