విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మోపిదేవి
ప్రజాశక్తి-నగరం: సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఈ నెల 16వ తేదీన నిజాంపట్నం వస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. మత్స్యకారులకు గతంలో నాలుగు వేల రూపాయలు అందించేవారని నేడు సీఎం జగన్ మోహన్‌రెడ్డి 10 వేల రూపాయలు అందజేస్తున్నారని తెలిపారు. 16న జరిగే ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










